Effective Home Remedies To Get Fair Skin Just 2 Weeks In Telugu

Effective Home Remedies To Get Fair Skin Just 2 Weeks
తెల్లటి పాలవంటి మెరిసే చర్మాన్ని అందించే గృహ ఔషదాలు
Contents
టమోటా
వంటలలో వాడే ఈ సాధారణ కూరగాయ రకం చాలా రకాలుగా చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో టమోటాను తెసుకొని గుజ్జుగా మార్చి, దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటూ ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డల్ గా మారిన చర్మాన్ని తిరిగి పునరుద్దరణకు గురి చేస్తుంది. అంతేకాకుండా, చర్మ నిర్మాణాన్ని మరియు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
తేనె
యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్క కలిపి ముఖాన్నికి అప్లై చేయాలి. కొద్ది సమయం తరువాత కడిగి వేయండి. ఇలా రోజు చేయటం వలన మీ ముఖ:కాంతి రెట్టింపు అవుతుంది.
ఉసిరి
యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ ‘C’ అధికంగా కలిగి ఉండే ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. దీనితో పాటుగా చర్మ నిర్మాణాన్ని సరి చేస్తుంది. రోజు రాత్రి పడుకోటానికి ముందు ఒక చెంచ ఉసిరిరసాన్ని, ఒక చెంచా తేనెను కలపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు కడిగి వేసి తరువాత కలిగే మార్పులను గమనించండి.
పెరుగు
పెరుగు అంటే దాదాపు మనలో అందరికీ ఇష్టమే. పెరుగు వలన ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటూ అలాగే ఉంచి కడగి వేయండి. దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి, పాల వంటి చర్మాన్ని అందిస్తుంది.