Hair Care Tips For Dry And Oily Hair In Telugu
మీ కేశాల సమస్యలను త్రోలగించటానికి మొదటగా వెంట్రుకల యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి. సాధారణంగా వెంట్రుకల సమస్యలను బట్టి వాటిని మూడు రకాలుగా విభజించారు. మొదటిది-జిడ్డుగా ఉండే వెంట్రుకలు, రెండవది-పొడి వెంట్రుకలు మరియు చివరది-సాధారాణ వెంట్రుకలు, ఇక్కడ జిడ్డు మరియు పొడి వెంట్రుకల గురించి తెలుపబడింది.
జిడ్డుగా ఉండే వెంట్రుకలు
మీ తలపై చర్మంలో ఉండే గ్రంధులు ఉత్తేజానికి గురయ్యి, అధిక నూనెలను ఉత్పత్తి చేయటం వలన జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగా ఉండే కేశాలు అతుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని సార్లు అలా కనిపించదు కుడా, కానీ ఇది వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళిని అధికంగా గ్రహిస్తుంది. కావున కేశాలు తొందరగా దుమ్ముపట్టి, తలపై చర్మానికి మరియు జుట్టుకి చాలా ఆరోగ్య సమస్యలను తెస్తుంది. ఈ విధంగా వెంట్రుకల మధ్య చుండ్రు ఏర్పడి జుట్టు రాలటానికి కారణం అవుతుంది.
నిర్వహణ
- క్రమంగా హెన్న ఉన్న షాంపూతో కడగాలి. దీని వలన వెంట్రుకల రంగు ప్రభావితం అవకుండా ఉంటుంది, అధికంగా ఉన్న ఆయిల్’ని గ్రహించుకుంటాయి, వెంట్రుకలకు తగినంత విధంగా పొడితత్వాన్ని చేకూరుస్తాయి.
- మీ వెంట్రుకలకు నూనెలను వాడకూడదు, వెంట్రుకలకు బలాన్ని అందించే టానిక్’లను వాడండి. ఇది మీ జుట్టుకి బలాన్ని చేకురుస్తుంది.
- మీ జుట్టు ఆరోగ్యంగా ఉండానికి హెన్నాని వాడండి.
పొడి వెంట్రుకలు
పొడిగా ఉండే జుట్టు, తలపై ఉండే చర్మ గ్రంధులు నూనెలను స్రవించక లేదా ఉత్పత్తి చేయకపోవటం వలన వెంట్రుకల పొడిగా మారతాయి. కావున జుట్టు రసాయనాల వలన, సూర్యకాంతి, దుమ్ము, ధూళి వలన జుట్టు పాడయిపోతుంది.
పొడి జుట్టు వలన సమస్యలు
- పొడిగా ఉండే జుట్టు వలన తలపై చర్మం కూడా చుండ్రుకి ప్రభావితం అవుతుంది. ఇది వెంట్రుకల మొత్తానికి విస్తరించి, చూడటానికి నాణ్యత రహితంగా కనపడుతుంది. అపుడపుడు చుండ్రు ధరించే దుస్తువుల పైన కూడా పడవచ్చు.
- వెంట్రుకల కణాలు గరుకుగా మారి, ప్రకాశరహితంగా మారుతుంది.
- వెంట్రుకలు ఎక్కువగా పొడిగా మారటం వలన జుట్టు పాడైపోయి మధ్యలో తెగిపోతుంది.
చికిత్స
- మొదటగా మీ జుట్టు స్థితిని తెలుసుకోవటం వలన మీ వెంట్రుకలకు తగిన చికిత్స చేయటం చాలా సులభం. కానీ ఇందులో నిపుణులు మాత్రమే మీ జుట్టు స్థితిని తెలుసుకొని, దానికి సరైన చికిత్సని అందించగలరు. కావున మీ జుట్టుకి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెంట్రుకలను ఆరోగ్యవంతంగా నిర్వహించటం చాలా మంచిది.
- రోజు గోరు వెచ్చని హెర్బల్ నూనెలతో మసాజ్ చేయండి. మీ చేతి వెళ్ళని వాడి మాత్రమే నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆ తరువాత, 5 నుండి 10 నిమిషాల వరకు వేడి టవల్’ని మీ తల చుట్టూ చుట్టండి. ఒకవేళ మీరు సెలూన్’కి వెళ్ళినట్లయితే, మీ వెంట్రుకలకు వేడి ఆవిరులను మరియు వేడి నీటితో కడిగించండి. దీని వలన మీ తలపై ఉండే చర్మ కణాలను తెరచి మీ వెంట్రుకలకు బలాన్ని చేకూరుస్తాయి.
- పత్తి ముక్కతో పూర్తి గుడ్డుని మీ తలపై చర్మానికి అద్దండి. అలాగే 4 నుండి 5 గంటల పాటు వదిలేయండి. ఆ తరువాత ఒక మంచి హెర్బల్ షాంపూతో కడిగివేయండి.
- ప్రతి రోజు ఒక మంచి హెర్బల్ కండిషనర్’ను ఉపయోగించి జుట్టుని కడగండి.
- మీ జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోండి. ఒత్తిడి, అధిక పని వంటి వాటి వలన మీ జుట్టు ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కావున వీటి నుండి అధిగమించి, మీ జుట్టు ఆరోగ్యాన్ని మరియు ప్రకాశవంతంగా కనపడేలా చేసుకోండి.
- సూర్యరశ్మికి మరియు కాలుష్యానికి వీలయినంత దూరంగా ఉండటం మంచిది.
- అంతేకాకుండా మీరు తినే ఆహరం కుడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహరం, పండ్ల రసాలు, మరియు సలాడ్’లను ఎక్కువగా తీసుకూటానికి ప్రయత్నించండి. పోషకాల కొరత వలన మీ జుట్టు అనారోగ్యానికి గురి అవవచ్చు. కావున మీ ఆహారంలో పోషకాల కొరత లేకుండా చూసుకోండి. కార్బోనేటేడ్ ద్రావణాలకు, జంక్ ఫూడ్’లకు దూరంగా ఉండటం వలన మీ ఆరోగ్యానికి మరియు జుట్టుకు చాలా మంచిది.