Hair Care Tips for Curly Hair in Telugu

Hair Care Tips for Curly Hair in Telugu

ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

సాధారణంగా చెప్పాలంటే మనలో చాలా మందికి వారి దగ్గర ఉన్నది ఎపుడు స్వతహాగా నచ్చదు. అలానే సొగసైన మృదువు వెంట్రుకలు కలిగి వున్న అమ్మాయిలు ఉంగరాల జుట్టు కావాలని, ఉంగరాల జుట్టు కలిగి వున్నఅమ్మాయిలు సొగసైన మరియు మెరిసే జుట్టు కావాలని కోరుకుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉండే అమ్మాయిలలోని సొగసైన విషయాలు – ఎలాంటి ముఖ ఆకారం కలిగి ఉన్నవారికైనా ఈ శిరోజాలు నప్పుతాయి తద్వారా వాళ్ళు మరింత అందంగా మరియు శృంగార భరితంగా కనిపిస్తారు, ఈ రకమైన జుట్టు కలిగి ఉన్నవారి ముఖంపై గల మడతలు కన్పించకుండా చేసి, ఏ వయస్సులో అయినా అందంగా కన్పించేలా సహకరిస్తాయి. మీరు మరింత అధునాతనంగా మరియు అందంగా కన్పించే విధంగా చేసే కొన్ని చిట్కాలు మేము మీకు ఇక్కడ అందిస్తున్నాము.

నిర్మాణపరమైన లక్షణాలు

ఉంగరాల జుట్టు కలిగిన అమ్మాయిల వెంట్రుకలు పొడి బారినట్లుగా వుంటాయి. ఎందుకంటే ఇవి వెంట్రుకల కుదుళ్ళు సమాంతరంగా ఉండటానికి బదులుగా, పైకి లేచి విప్పుకున్నట్లుగా ఉండటడమే కారణం. ఈ శిరోజాల కుదుళ్ళు పైకి లేచి విప్పుకున్నట్లుగా ఉండటం వలన తేమను కోల్పోయి దెబ్బ తిన్నట్లుగా కన్పిస్తాయి.

శిరోజాల కత్తిరింపు

మీ వెంట్రుకలు తేమను కోల్పోయి వెంట్రుకల చివర్లు, లోనికి ముడుచుకొని ఆకృతి కోల్పోయినట్లయితేనే తప్ప మీ వెంట్రుకలను కత్తిరించకూడదు. శిరోజాలు గదవకి మరియు కాలర్ బోన్స్ కి దగ్గరగా పొడవు పొరలు- పొరలుగా ఉండేట్లు చూసుకోవాలి. ఎపుడు కూడా జుట్టు ఉంగరాలుగా ఉన్నాయని బాధపడనవసరం లేదు. ఈ వెంట్రుకలు మీకు అనుకూలంగా ఉండేట్లు చేసుకోవాలి. ఈ రకం వెంట్రుకలకు తగిన సంరక్షణ చాలా అవసరం.

స్థితి మరియు శుభ్రత

స్పష్టంగా చెప్పాలి అంటే, ఉంగరాల జుట్టు మృదువుగా మరియు మెరిసే విధంగా కన్పించాలి అంటే తేమ అధికంగా వుండాలి. కొన్ని నెలల వరకు ప్రత్యామ్నాయ రోజులలో వీటిని శుభ్రపరుస్తూ వుండడం వలన ప్రతిరోజూ పొడి బారినట్లుగా, చిట్లకుండా కాకుండా, ఆకర్షణీయంగా కన్పించేలా చేసుకోవచ్చు. హైడ్రేటింగ్ షాంపు మరియు కండిషనర్లను మాత్రమే ఉపయోగించాలి.

Read More:   This is how you can end acne on your scalp

స్నానం ముగించిన తర్వాత, కండిషనర్ ను మీ అర చేతిలోకి కొద్దిగా పోసుకొని, మరో అర చేతిని ఉపయోగించి రెండు చేతులను ఒకదానికి ఒకటి రాసి, వెంత్రుకలంతటా సమానంగా తీరికతో పట్టించాలి. ఈ విధంగా కండిషనర్ పట్టించడం వలన మీ వెంట్రుకలు డెటంగిల్, హైడ్రేట్ మరియు డి- ఫ్రిజ్ గా ఉంచేట్లుగా సహాయపడుతుంది. షాంపూతో స్నానం చేయని రోజులలో, మీ వెంట్రుకలను తిరిగి నీటితో తడిపి కండిషనర్ ఆపాదించాలి. మిగతా అన్ని రకాల వెంట్రుకల కన్నా ఉంగరాల జుట్టు చాలా బలహీనంగా వుంటాయి
కాబట్టి వారానికి ఒకసారైన సెలూన్ కి వెళ్లి వెంట్రుకలు  బలోపేతానికి కావలసిన వివిధ పద్దతులు పాటించాలి.

శైలి

మీరు మళ్ళి ఎపుడైనా స్టైలింగ్ క్రీమ్ కొనడానికి దుకాణాలకు వెళ్ళినపుడు, కొబ్బరి, ఖనిజ పదార్దాలు మరియు బాదం నూనె వంటి సహజ పదార్దాలు కలిగి ఉన్న మంచి స్టైలింగ్ క్రీమ్ లను ఎంచుకోవాలి. అందులో నుండి కొన్ని చుక్కలు తీసుకొని మీ తడి శిరోజాల కుదుళ్ళ నుండి చివరి భాగం వరకి పట్టించాలి. ఇది మీ శిరోజాలకు తేమను పట్టి ఉండేలా చేసి, గరుకుగా మరియు అతుకుపోయినట్లుగా కన్పించకుండా ఉంగరాలు ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తాయి. శిరోజాలను ఆరబెట్టుకోవడానికి మీరు ఎయిర్- డ్రయర్ ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే మానుకోండి. సహజ గాలి ద్వారానే ఆరేల చూడాలి లేదా మీ వేళ్ళను ఉపయోగించి శిరోజాలను సగం నుండి ఒక అంగుళ భాగం వరకి తీసుకుంటూ వాటిని మెలి తిప్పుతూ మంచి ఆకృతి పొందేలా చేసుకోవచ్చు.

 

Leave a Reply